Friday, April 19, 2024

బ‌ల‌గం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. సిరిసిల్లా బతుకమ్మ ఘాట్ నుంచి ప్ర‌త్య‌క్ష్య ప్ర‌సారం..

సిరిసిల్లాలో జ‌రుగుతున్న బ‌ల‌గం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజ‌రయ్యారు.. రాజన్నసిరిసిల్ల జిల్లా నుండి వస్తున్న తొలి పెద్ద సినిమా బలగం. 1997 లో సిరిసిల్ల మార్కెట్ లో కూరగాయలు అమ్మిన వేణు వెల్దండి …. తెలుగు పాపులర్ కామెడీ షో ‘జబర్దస్త్’తో కమెడియన్‌ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన కమెడియన్ ‘వేణు’. జబర్దస్త్‌లో తన కామెడీతో అందర్నీ ఆకట్టుకున్న వేణు.. ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకొని దర్శకుడిగా మారబోతున్నాడు. వేణు స్వస్థలం సిరిసిల్ల. ఈ సినిమా షూటింగ్ మొత్తం రాజన్నసిరిసిల్లజిల్లా కోనరావుపేట మండలంలోని కొలనూరు గ్రామంలో జరిగింది. బలగం సినిమాలో దాదాపు 200 మంది గ్రామస్థులు కనిపిస్తారు. అలాగే, బలగం సినిమాలో ఆర్టిఫిషియల్ తెలంగాణ యాస కాకుండా నాచ్యురల్ తెలంగాణ యాస చూడవచ్చు.ఈ చి్ర‌తంలో ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ మూవీ మార్చి 3వ‌తేది విడుద‌ల కానున్న నేప‌థ్యంలో మంత్రి కెటిఆర్ స్వంత నియోక‌వ‌ర్గం సిరిసిల్లాలోని బతుకమ్మ ఘాట్ వేదికగా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌ను ఏర్పాటు చేశారు.. ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్యక్ష్య ప్ర‌సారంగా తిల‌కించ‌గ‌ల‌రు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement