Monday, March 27, 2023

నాందేడ్ సభకు ఏర్పాట్లు షురూ..

బారత రాష్ట్ర సమితి రెండవ భారీ బహిరంగ సభ మహారాష్ట్రలోని నాందేడ్ లో ఫిబ్రవరి 5న నిర్వహించనున్నారు. శనివారం బహిరంగ సభ ఏర్పాట్లను బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాందేడ్ లోని గురు గోవింద్ సింగ్ జీ మైదానంలో ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఆదిలాబాద్, ఆర్మూర్, జుక్కల్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, జీవన్ రెడ్డి, షిండే, పాటిల్, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, టిఎస్ఐఐసి చైర్మన్ బాలమల్లుతో పాటు పలువురు బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బిఆర్ఎస్ మొదటి బహిరంగ సభ ఖమ్మంలో నిర్వహించగా రెండవ సభ మహారాష్ట్రలోని నాందేడ్ లో నిర్వహిస్తున్నారు. బహిరంగ సభకు బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ హాజరై ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అంతకు ముందు ప్రైడ్ హోటల్లో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement