Thursday, April 25, 2024

రాజన్న జిల్లాలో వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ : ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి వార్షిక మొబలైజేషన్ లో భాగంగా ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. శనివారం జిల్లాలోని 17వ బెటాలియన్ లో గలా ఫైరింగ్ రేంజ్ లో ఫైరింగ్ శిక్షణ ఇచ్చి ఫైరింగ్ ప్రాక్టీస్ చేయించడం జరిగిందన్నారు. వార్షిక శిక్షణలో భాగంగా జిల్లాలో పని చేస్తున్న సిబ్బందికి ఇచ్చే ఫైరింగ్ శిక్షణ ను పర్యవేక్షించడంతోపాటు ఫైరింగ్ ప్రాక్టీస్ చేయడం జరిగిందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ కూడా అధునాతన టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవడంతో పాటుగా అన్ని రకాల ఆయుధ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలని, సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు శిక్షణలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అదేవిధంగా ఏమైనా అల్లర్లు సంభవించినప్పుడు అల్లరి మూకలను చేదరగోటడనికి వజ్ర వెహికల్ ని ఉపయోగించే విధానాన్ని వజ్రా వెహికల్ ఉపయోగించి అల్లరి మూకలు చదరగొట్టడాన్నికి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ శిక్షణలో నేర్పించిన మెలకువులను శ్రద్ధతో అభ్యసించి సమయానుకూలంగా శాంతిభద్రతలు పరిరక్షణకు ఉపయోగించాలన్నారు. ఫైరింగ్ లోఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులను సిబ్బందిని ఎస్పీ అభినదించారు. ఈ శిక్షణలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్.ఐలు కుమారస్వామి, రజినీకాంత్, యాదగిరి, సి.ఐ అనిల్ కుమార్, ఆర్.ఎస్.ఐలు ఏ.ఆర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement