Saturday, May 8, 2021

ఆనంద నిలయానికి విరాళం..

మంచిర్యాల : క్రెడాయ్‌ మంచిర్యాల సభ్యులు వేణు మాదవ్‌ (బిల్డర్‌) మామయ్య పరమపదించడంతో 12వ రోజు కర్మ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేని కారణంగా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వృద్దాశ్రమం (ఆనంద నిలయానికి) రూ.10వేల విరాళాన్ని క్రెడాయ్‌ తెలంగాణ ఉపాధ్యక్షుడు, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్యాట్రన్‌ మెంబర్‌ వి.మధుసుదన్‌రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్‌ మంచిర్యాల చైర్మన్‌ జి.నర్సింహారెడ్డి, వృద్దాశ్రమం నిర్వాహకులు, వృద్దులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News