Sunday, October 13, 2024

Peddapalli: నల్ల బ్యాడ్జీలతో ఏఈఓల నిరసన..

పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 1(ప్రభ న్యూస్): పెద్దపల్లి మండలంలోని రైతు వేదికల్లో మంగళవారం ఏఈఓలు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహణ కష్టతరమని నినదించారు. డీసీఎస్ సర్వే నిర్వహణకు గ్రామ స్థాయిలో సహాయకులు నియమించాలని డిమాండ్ చేశారు.

ఏఈఓలపై డీసీఎస్ సర్వే చేయాలని ఒత్తిడి తేవడానికి నిరసనగా రాష్ట్ర వ్యవసాయ విస్తరణ అధికారుల ఐకాస పిలుపు మేరకు ఏఈఓలు నల్ల బ్యాడ్జీలు ధరించి రైతు నేస్తం వీడియో సమావేశానికి హాజరయ్యారు. నిరసనలో మండలంలోని ఏఈఓలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement