Wednesday, March 27, 2024

మల్టీ సౌండ్‌ హారన్‌లపై కొరఢా.. వినియోగిస్తే చర్యలు తప్పవు : పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి

పాలకుర్తి : మల్టీ సౌండ్‌ హారన్‌లు ఉపయోగించే వారిపై పెద్దపల్లి పోలీసుల కొరఢా ఝుళిపించారు. శుక్రవారం పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా బసంత్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని టోల్‌గేట్‌ వద్ద ట్రాఫిక్‌ పోలీసులు ఆకస్మిక వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనాల హారన్‌ ధ్వనులు రొజురోజుకు పెరిగిపోతున్నాయని, గాలి కాలుష్యంతో పాటు-గా శబ్ద కాలుష్యం విపరీతంగా పెరగడంతో, ఇతర వాహనదారులకు ఇబ్బంది కలుగుతుం దన్నారు. మల్టీ సౌండ్‌ హారన్‌ లు ఉపయోగిస్తూ భయబ్రాంతులకు గురి చేయడం, ఇతర వాహనాలకు, ఇబ్బంది కలిగించడంతో మల్టీ సౌండ్‌ హారన్లు ఉపయోగించే వాహనాలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. మోటార్‌ వాహనాల చట్టం ప్రకారం వాహనాలకు ఉన్న హారన్లు కాకుండా, మల్టీ సౌండ్‌ హారన్‌ వినియోగిస్తే ప్రస్తుతం హారన్లను స్వాధీనం చేసుకుంటామన్నారు. హారన్ల తొలగింపుకు వాహనదారులకు సమయం ఇస్తున్నామని, వారిలో మార్పు రాకపోతే కేసులు నమోదు చేసి, కోర్టుకు పంపి శిక్ష విధించేలా చూస్తామన్నారు. ఈ తనిఖీల్లో పెద్దపల్లి సిఐ ప్రదీప్‌ కుమార్‌, పెద్దపల్లి ట్రాఫిక్‌ ఇన్స్పెక్టర్‌ అనిల్‌ కుమార్‌, ఎస్సై బసంత్‌ నగర్‌ శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement