Wednesday, February 8, 2023

పెద్ద‌ప‌ల్లి జిల్లాలో ఘనంగా జెండా పండుగ

గణతంత్ర దినోత్సవ వేడుకలు పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు వందనం స్వీకరించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేడుకల్లో పెద్దపల్లి డిసిపి రూపేష్, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, మున్సిపల్ చైర్మన్ మమతారెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement