Friday, April 26, 2024

ఘనంగా ‘కవిత’ జన్మదిన వేడుకలు

పెద్దపల్లి: నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కవిత జన్మదినం సందర్భంగా కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ అంతరించిపోతున్న మన సాంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఘతన కల్వకుంట్ల కవితక్కకు దక్కిందన్నారు. రాష్ట్రంలో లక్షల గొంతుక లను ఏకం చేసి ముందుకు నడిపి తెలంగాణ బతుకమ్మగా రాష్ట్ర ప్రజలందరి చేత మన్ననలు పొందిన కవితక్క నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి మరియు తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు, అభిమానులతోపాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement