Thursday, April 25, 2024

ఘనంగా కవిత జన్మదిన వేడుకలు

ఎల్లారెడ్డిపేట:తెలంగాణ జాగృతి రాజన్న సిరిసిల్ల జిల్లా కో కన్వీనర్‌ వరద సతీష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని అంబర్ పేట్ ‌ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ కార్యాలయంలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కల్వకుంట్ల కవిత అక్క పుట్టినరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంబర్పేట్‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య పాల్గొని కేక్‌ కట్‌ చేసి కవిత అక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్‌ అందె సుభాష్‌, స్థానిక మాజీ కార్పొరేటర్‌ రమేష్‌,సిరిసిల్ల -| డైరెక్టర్‌ దేవేందర్‌ యాదవ్‌ ,టిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు అజ్మీర రాజునాయక్‌ ,పిల్లి కిషన్‌ ,పందిళ్ళ పరశురాములు, బొప్పాపూర్‌ మార్కెట్‌ కమిటీ- డైరెక్టర్లు సింగారం దేవరాజు,తడకల దేవరాజు,ముత్యాల శేఖర్‌ రెడ్డి, కోరుట్ల పేట ఎంపిటిసి మధు , మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డి సురేష్‌ ,మండల యూత్‌ నాయకులు కొర్రి అనిల్‌ పాల్గొన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement