Sunday, May 9, 2021

ఉచిత బస్సు సౌకర్యం

ముత్తారం:కరీంనగర్‌ జిల్లా నగునూరు లోని ప్రతిమ ఆసుపత్రి ఆద్వర్యంలో ప్రతి శనివారం రోజున ముత్తారం మండలం లోని అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉచిత బస్సు సౌకర్యంను ఏర్పాటు చేశారు. గ్రామాల లో వుండే మహిళలు, వృద్ధులు ,వికలాంగులకు, ఆసుపత్రి లో వుండే అన్ని సేవలను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అనికేషనపల్లి సర్పంచ్‌, మండల సర్పంచ్‌ ల ఫోరం అధ్యక్షుడు నూనె కుమార్‌ తెలిపారు.ఈ కార్యక్రమంలో దరియపూర్‌ సర్పంచ్‌ గదాం స్రవంతి శ్రీనివాస్‌, ఎంపిటిసి బియ్యని శ్యామల సదానందం, రామగళ్ల పోచమ్మ మాధుకర్‌, ఉప సర్పంచ్‌ తాత స్వప్న బాలు,వార్డ్‌ మెంబెర్స్‌ చుంచు రమేష్‌, గాజుల శ్రీనివాస్‌, చిందం సదానందం, చొప్పరి శివయ్య, కళావేన రాజబాబు, అలాగే ప్రతిమ ఫౌండేషన్‌ ముత్తారం మండల్‌ ఆర్గనైజర్‌ చీరాల రాజ్‌ కుమార్‌, సైయాద్‌ ఆఫీజ్‌, డ్రైవర్‌ వడ్లకొండ రమేష్‌ లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News