Wednesday, October 9, 2024

Karimnagar – అక్రమ కార్యకలాపాలపై ఉక్కు పాదంతో అణచి వేయండి .. సీపీ అభిషేక్ మహంతి

కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ డయల్ 100 కాల్ రిసీవ్ చేసుకోగానే వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఆదేశించారు.

గురువారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో గల పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు ఇచ్చారు. వాటికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన వాటిని పూర్తి చేయాలనీ సూచించారు. విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టిపెట్టి క్షేత్ర స్థాయిలో ఫలితాన్నిచ్చే విధంగా సందర్శనలు ఉండాలన్నారు. స్థానికంగా ఉండే శాంతి భద్రతల సమస్యలు, రౌడీ షీటర్లు మరియు హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు.

ప్రతి నెల వారికి సంబందించిన నూతన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి నమోదు చేసుకోవాలన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాల్లో అధికారుల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. పెండింగ్ వారెంట్ల అమలు చేయాలన్నారు.అక్రమ ఇసుక రవాణా, పి.డి.ఎస్. బియ్యం రవాణా, మద్యం బెల్టు షాపుల నిర్వహణ వంటి అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపి, పట్టుబడిన వారిపై తగిన కేసులు నమోదు చేయాలన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీ గోపతి నరేందర్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ. ఇన్స్పెక్టర్ పిట్టల విజయ్ కుమార్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement