Thursday, April 25, 2024

ఫ్రంట్ లైన్ వారియర్స్ బూస్టర్ డోస్ తీసుకోవాలి

ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పిలుపునిచ్చారు. గురువారం పోలీస్ పరేడ్ గ్రౌండ్, అంబేద్కర్ స్టేడియంలోని కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లను కలెక్టర్ సందర్శించారు. బూస్టర్ డోస్, కోవ్యాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ స్టాక్ వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండు డోసుల కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్న ఫ్రంట్ లైన్ వారియర్స్, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లకు బూస్టర్ డోస్ ఇవ్వాలని అన్నారు. 15 నుంచి 18 సంవత్సరాల వయసు వారికి వ్యాక్సినేషన్ ఇవ్వాలన్నారు.

రెండవ డోసు తీసుకోని వారికి, ఓవర్ డ్యూ ఉన్న వారిని గుర్తించి వ్యాక్సినేషన్ ఇవ్వాలని వైద్య సిబ్బందికి సూచించారు. కరోనా మూడవ దశను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, గుంపులుగా తిరగవద్దు అని కలెక్టర్ కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement