Tuesday, April 23, 2024

మునుగోడు ఎన్నికలో 50వేలఓట్ల మెజార్టీతో గెలవబోతున్నా..కేఏపాల్

పోలీసులు తమని ఇబ్బందులకు గురి చేశారని ..ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ తెలిపారు.మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆయన మండిపడ్డారు. రెండు ప్రధాన పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేశాయని… అయినప్పటికీ ఆ పార్టీలకు గెలిచే పరిస్థితి లేదని చెప్పారు. జిల్లా ఎస్పీ కూడా టీఆర్ఎస్ కు ఏజెంట్ మాదిరి వ్యవహరించారని ఆరోపించారు. తనకు కనీసం గన్ మెన్లను కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. గద్దర్ కు గన్ మెన్లను ఇచ్చారని, తనకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మునుగోడులో గెలుపు తనదే అని కేఏ పాల్ చెప్పారు. 50 వేల ఓట్ల మెజార్టీతో తాను గెలవబోతున్నానని అన్నారు. మునుగోడు మహిళలు, యువత తనపై ఎంతో ప్రేమను చూపించారని చెప్పారు. 155 దేశాల్లో తిరిగినా దక్కని ప్రేమ తనకు మునుగోడులో లభించిందని అన్నారు. ప్రచారం సమయంలో తనపై మూడు సార్లు దాడులకు యత్నించారని… రిటర్నింగ్ అధికారితో పాటు ఇతర అధికారులు తనను రక్షించారని చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం మొత్తం ఒక డ్రామా అని పాల్ అన్నారు. బీజేపీలో చేరితే తనకు మంత్రి పదవి ఇస్తానని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆఫర్ ఇచ్చారని చెప్పారు. బీజేపీ తనకు పరోక్షంగా మద్దతును ఇచ్చిందని, కాంగ్రెస్ నేరుగా మద్దతును ప్రకటించిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement