Saturday, April 20, 2024

హైకోర్టును ఆశ్రయించిన కామారెడ్డి రైతులు

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ తీవ్ర కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దీని వలన తమ భూములను కోల్పోవాల్సి వస్తుందని రైతులు మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాధిత రైతులు మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డు రామేశ్వర్ పల్లి రైతులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తమను సంప్రదించకుండా భూములను రీక్రియేషనల్ జోన్ గా ప్రకటించారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ మేరకు రైతులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement