Thursday, April 18, 2024

‘కల్యాణ లక్ష్మి’ తో పేదింట ఆనందకాంతులు : ఎమ్మెల్యే చందర్

తెలంగాణ రాష్ట్రంలోని పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు భారం కావద్దని భావించి దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కల్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశ పెట్టి ఒక లక్షా నూట పదహార్రూపాయాలు అందిస్తూ పేదింటి కుటుంబాల్లో కాంతులు నింపుతున్న మనసున్న మారాజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 47,25,2, 4 డివిజన్ ల్లో ఇంటింటికి వెళ్లి కల్యాణ లక్ష్మి చెక్కులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటాన్ని లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా అందించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్ర పాలనలో తండాల్లో ఆడపిల్ల పుడితే అమ్ముకునే పరిస్థితులు ఉండేవని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కేసీఆర్‌ గారి పాలనలో ఆడపిల్ల పుడితే మహలక్ష్మి పుట్టిందని సంబురపడుతున్నరన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సంక్షేమంప్రతి ముఖాల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గొప్ప పరిపాలన సాగిస్తున్నారని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement