Friday, March 29, 2024

పినపాక నల్లపు మణిదీప్ సేవలు అమోఘం…న్యాయ విద్యార్థి కి జేడీ లక్ష్మీనారాయణ అభినందనలు

హైదరాబాద్ – ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ ప్రజలకు,విద్యార్థులకు న్యాయం చేస్తున్నభద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంకి చెందిన న్యాయ విద్యార్థి నల్లపు మణిదీప్ సేవలు అమోఘమని భద్రాద్రి జిల్లా జేడీ ఫౌండేషన్ జేడీ లక్ష్మీనారాయణ మణిదీప్ ను అభినందించారు.మంగళవారం అభినందించిన లో న్యాయ విద్యార్థి మణిదీప్ ను కలుసుకోని శాలువా కప్పి అభినందించారు.అనంతరం జేడీ ఫౌండేషన్ ద్వారా అభినందన పత్రంను అందజేశారు.ఈసందర్బంగా జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ…ఇటీవల మణిదీప్ తెలంగాణ హైకోర్టు ఓ లేఖ రాశారు.ఆలేఖను హైకోర్టు సుమోటో తీసుకొని ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కింద స్వీకరించి 700 మందికి ఒకే ఒక్క టాయిలెట్ ఉండడం ఏమిటని ప్రశ్నించిందని..?అసలు తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల్లో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయో నివేదిక రూపంలో సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాకి నోటీసులు జారీ చేసిందని ఆయన తెలిపారు.అలాగే గతంలో కూడా మణిదీప్ రాసిన రీసెర్చ్ లేకను సుమోటో ప్రజా ప్రయోజనాల వ్యాఖ్యం కింద త్రిపుర హైకోర్టు తీసుకుంది.త్రిపుర రాష్ట్రంలో బెయిల్ వచ్చిన కూడా జైళ్లలో ఐదు సంవత్సరాలకు పైబడి మగ్గుతున్ననిరుపేదలను విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా త్రిపుర రాష్ట్ర ప్రభుత్వానికి,త్రిపుర జిల్లా అందరికీ నోటీసులు జారీ చేసిందని చెప్పారు.దీంతో వెంటనే జైళ్లలో మగ్గుతున్ననిరుపేదలను త్రిపుర కోర్ట్ విడుదల చేసిందన్నారు.అలాగే ప్రజా సమస్యలపై మణిదీప్ రాసిన మరొక లేఖను సుమోటోగా మానవ హక్కుల కమిషన్ తీసుకుందన్నారు.సూర్యాపేట జిల్లాలో పోలీస్ స్టేషన్లో జై భీమ్ తరహాలో చిత్రహింసలకు గురి చేసినందుకుగాను చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు

.అంతేకాకుండా సమాచార కమిషనర్ మానవ హక్కుల కమిషన్ లోకాయుక్తల జడ్జిల లేమిని ప్రశ్నిస్తూ 2019లో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేయగా వేసిన నెల రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వం చైర్మన్లు కమిషనర్ల నియామకాలను చేపట్టిందని తెలియజేశారు.సమాచార హక్కు చట్టం ద్వారా దేశంలోని అన్నికోర్టులలో ట్రిబునల్లలో పెండింగ్ కేసులు,ఎన్నిసంవత్సరాలుగా పెండింగ్ దానికి గల కారణాలను,జడ్జిల కొరత,మౌలిక సదుపాయాలను మణిదీప్ ప్రశ్నించారని చెప్పారు.సహ”చట్టం ద్వారా అవినీతి నిర్మూలనకు కృషి చేస్తూ సామాన్య ప్రజలకు వాల్ల హక్కుల పైన అవగాహన కల్పిస్తూ పేద ప్రజలకు ఫ్రీ:లీగల్ ఎయిడ్ చట్టం ద్వారా ఉచిత సేవలు అందిస్తున్నారని తెలిపారు.అందుకే మణిదీప్ చేస్తున్న ప్రజా సేవల కృషిని గుర్తించి అభినందించానని తెలిపారు.అలాగే ఇటీవల సీపీఆర్ చేసి ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ డి.రాజశేఖర్ కు అభినందనలు తెలిపి శాలువాతో సత్కరించారు.ఈకార్యక్రమంలో జెడి ఫౌండేషన్ భద్రాచలం కన్వీనర్ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement