Monday, October 7, 2024

విద్యార్థుల కోసం జగ్గారెడ్డి దీక్ష

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫెయిలైన ఇంటర్ విద్యార్ధులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు దీక్షకు దిగారు. ఇవాళ ఇంటర్ బోర్డు ముందు ఆయన దీక్ష చేధారు. ఫెయిలైన విద్యార్థులను కనీస మార్కులు వేసి పాస్ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. గ్రేస్ మార్కులను కలిపే పద్దతి గతంలో కూడా ఉందని, ఈ పద్దతిని అనుసరించాలని జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఏడాది అక్టోబర్ మాసంలో ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్షల్లో సుమారు 49 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. 51 శాతం విద్యార్థులు ఫెయిలయ్యారు. అయితే ఇంటర్ విద్యార్థుల పరీక్షల విషయమై ఏం చేయాలనే దానిపై తెలంగాణ‌ ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది. దీంతో ఫెయిలైన విద్యార్ధులను పాస్ చేయాలనే డిమాండ్ తో విద్యార్ధి సంఘాల నేతలు, విద్యార్ధులు ప్రతి రోజూ ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థుల కోసం జ‌గ్గారెడ్డి ఇవాళ దీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా జ‌గ్గారెడ్డి మాట్లాడుతూ…
ఆన్‌లైన్‌ చదువులే కొంపముంచాయన్నారు. ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు ఎక్కువగా నష్టపోయారన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం దిగిరాకపోతే ఇంటర్‌బోర్డును ముట్టడిస్తామంటున్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఈ దీక్షకు కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా పొన్నాల మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులను ప్రమోట్ చేయడం ఏంటి? ఫెయిల్ చేయడం ఎందుకని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుతో విద్యార్థులు నష్టపోతున్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టొద్దన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement