Wednesday, October 9, 2024

Konda Surekha: ఆ స్టార్ క‌పుల్ ని విడ‌దీసింది కేటీఆరే..

సినిమా న‌టీన‌టుల‌కు డ్ర‌గ్స్ అల‌వాటు చేసింది ఆయ‌నే
హీరోయిన్ల జీవితాల‌తో ఆడుకోవ‌డం ఆయ‌న‌కు అల‌వాటు
రేవ్ పార్టీల‌తో బ్లాక్ మెయిల్
కేటీఆర్ పై విరుచుకుప‌డ్డ మంత్రి కొండా సురేఖ


హైద‌రాబాద్ – అక్కినేని హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమని ఆరోపించారు మంత్రి కొండా సురేఖ. కేటీఆర్‌కు హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం అలవాటని.. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది ఆయనేనన్నారు.

బాపూఘాట్ లోనేడు జ‌రిగిన గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ..”కేటీఆర్ కు తల్లి అక్క, చెల్లి లేరా. హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారు. మత్తు పదార్థాలు అలవాటు చేశారు. వాళ్ల ఫోన్లు ట్యాప్ చేశారు. చాలా మంది హీరోయిన్లు త్వరగా పెళ్లిళ్లు చేసుకుని సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి ఆయనే కారణం అంటూ ఆరోప‌ణ‌లు గుప్పించారు.

- Advertisement -

ఆయన డ్రగ్స్‌కు అలవాటుపడి వాళ్లకూ అలవాటు చేశార‌ని మండిప‌డ్డారు కొండా సురేఖ‌. రేవ్ పార్టీలు చేసుకుని వాళ్లని బ్లాక్ మెయిల్ చేశార‌ని, ఈ విషయం సినీ ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసన్నారు. బీఆర్ఎస్ దొంగ ఏడుపులు మాకవసరం లేద‌ని అంటూ హరీశ్ రావు మనసున్న మనిషిగా స్పందించారన్నారు.. త‌న‌పై ట్రోలింగ్ జరిగినప్పుడు ఎందుకు స్పందించలేద‌ని కేటీఆర్ ను నిల‌దీశారు. మంత్రి సీతక్క, మేయర్‌ గద్వాల విజయలక్ష్మిపై అసభ్యకర పోస్టులు పెట్టార‌ని అంటూ ఐదేళ్లు బీఆర్ఎస్‌లో పనిచేశాన‌ని, త‌న‌ వ్యక్తిత్వం అందరికీ తెలుసన్నారు. అసభ్యకరంగా పోస్టులు పెట్టినవారిపై ఫిర్యాదు చేశామ‌న్నారు. రాజకీయ విలువలు దిగజారిపోయాయ‌న్నారు. ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తిచూపాలని, వ్యక్తిత్వం దెబ్బతీసేలా ప్రవర్తించవద్దని అన్నారు. దుబాయి నుంచి నాలుగు సోషల్ మీడియా అకౌంట్లతో త‌న‌పై ఫేక్ పోస్టులు పెడుతున్నారు”అని సురేఖ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement