ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్ ఆఫీసుల్లో ఐటీ డిపార్ట్‌మెంట్ దాడులు చేపట్టింది. ఏకకాలంలో చేపట్టిన ఈ దాడులతో ఉద్యోగులు ఒక్కసారిగా పరేషాన్ అయ్యారు. ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు రాత్రి అయినా ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. వాసవి గ్రూప్స్ ప్రధాన కార్యాలయలో 20 మంది ఐటీ అధికారులు బృందం సోదాలు చేపట్టింది.
వాసవి రియాల్టీ, వాసవి నిర్మాన్, శ్రీ ముఖ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ఇండ్మాక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాసవి ఫిడిల్ వెంచర్స్ పేరుతో పలు సంస్థలులున్నాయి, వేల కోట్ల పనులు చేస్తూ ఇన్ కం ట్యాక్స్ చెల్లించడంలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈ దాడులు చేస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా అక్రమ లావాదేవీలపై కూడా ఐటీ అధికారులు అరా తీస్తున్నారు. వాసవి గ్రూప్స్ ఇప్పటి వరకు పూర్తి చేసిన ప్రాజెక్టులు.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల గురించి ఐటీ అధికారులు వివరాలు రాబడుతున్నారు.
వాసవి గ్రూప్స్ సంస్థలపై ఐటీ దాడులు.. ఏపీ, తెలంగాణల్లో కొనసాగుతున్న సోదాలు

- Advertisement -
Advertisement
తాజా వార్తలు
Advertisement