Friday, April 19, 2024

బాల వికాస్, మిష‌న‌రీ సంస్థ‌ల‌పై ఐటి దాడులు…

హైద‌రాబాద్ – తెలంగాణాలోని ప‌లు ప్రాంతాల‌లో నేటి ఉద‌యం నుంచి ఐటి దాడులు జ‌ర‌గుతున్నాయి.. క్రిస్టియన్ మిషనరీల‌తో పాటు ఇత‌ర సంస్థల్లో అధికారులు సోదాలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 40 చోట్ల ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఘ‌ట్ కేస‌ర్, మ‌ల్కాజ్ గిరి,అల్వాల్, పటాన్ చెరువు, కీసర, జీడిమెట్ల, బొల్లారం, సికింద్రాబాద్, మెదక్, వరంగల్ సహా పలు ప్రాంతాల్లో ఈ సోదాలు కొన‌సాగ‌తున్నాయి… ఈ రైడ్స్ ముగిసిన తరువాత పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి ఐటీ అధికారులు 20 బృందాలుగా విడిపోయి ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. బాలవికాసకు సంబంధించిన క్రిస్టియన్ మిషనరీలతో పాటు ఇత‌ర‌ సంస్థల్లో అధికారులు ఈ దాడులకు పాల్పడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. బాల‌వికాస్ సంస్థకు సంబంధించి ఆర్ధిక లావాదేవీలు, పన్ను ఎగవేతకు సంబంధించి పక్కా ఆధారాలతో అధికారులు పెద్ద ఎత్తున ఈ సోదాలు చేపట్టినట్టు సమాచారం.

హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణం ఫాతిమా నగర్ బాలవికాసలో బాలవికాస స్వచ్ఛంద సంస్థ ప్రధానకార్యాలయమైన కార్యాలయంలో బుధవారం తెల్లవారుజామునుంచే ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.స్వచ్ఛంద సంస్థ,అనుబంధ సంస్థలకు సంబంధించిన రికార్డులను ఐటీఅధికారులు బుధవారం ఉదయం నుంచి తనిఖీ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement