Friday, March 29, 2024

అత్య‌వ‌స‌ర సేవ‌ల కోసం అంబులెన్స్ ఇవ్వడం సంతోష‌క‌రం : ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

అత్య‌వ‌స‌ర సేవ‌ల కోసం తాను అంబులెన్స్ ను ఉప్పల విశ్వనాధం-అనంత లక్ష్మీ ల జ్ఞాపకార్థంగా ఆస్ప‌త్రికి అందివ్వ‌డం సంతోషక‌రంగా ఉంద‌ని ఉప్పల ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన పిలుపు మేరకు..గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా.. ఈరోజు సొంత నిధులతో ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబులెన్స్ ని అందజేశారు. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జెండా ఊపి అంబులెన్స్ ను ప్రారంభించడం జరిగింది. ఈసంద‌ర్భంగా టూరిజం చైర్మన్ ని మంత్రి కేటీఆర్ అభినందించారు.


ఈ సందర్భంగా..టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ.. ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. 3వేల‌ మంది పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు పుస్తె, మెట్టెలు, చీర, గాజులు, ఉచితంగా అందిస్తూ.. ఎంతో మంది పేదలకు రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలకు ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు. బియ్యం, నిత్యావసర వస్తువులు అందించామ‌ని, కరోన సమయంలో 2 లక్షల మందికి భోజనాలు, 14000 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు కిట్స్, 6000 వేల మందికి కరోన సేఫ్టీ కిట్స్ అందించడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఈ ఏడేండ్లలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నామన్నారు. సంక్షేమంలో దేశంలో నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు. వైద్య రంగానికి పెద్ద పీట వేశారన్నారు. అన్ని హాస్పిటల్ లలో అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారన్నారు.త‌న వంతు సాయంగా ఈరోజు ఉచిత అంబులెన్స్ అందించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో.. ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతశోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, ఉప్పల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఉప్పల స్వప్న, ఉప్పల సాయి కిరణ్, ఉప్పల సాయి తేజ, ఐవీఎఫ్ – ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు, ఐవీఎఫ్ సికింద్రాబాద్ జోన్ నాయకులు, ఆర్యవైశ్య నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement