Tuesday, April 16, 2024

పది రూపాయల కాయిన్ చెల్ల‌దా ?

శంకరపల్లి; అభివృద్ధి పథంలో కొనసాగుతుంది అనుకుంటున్న శంకర్ ప‌ల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల ఆలోచనా విధానం ఇంకా గత కాలపు స్మృతులను విడనాడటం లేదు. రిజర్వ్ బ్యాంక్ అనుమతితో చలామణి అవుతున్న పది రూపాయల కాయిన్ల‌ను శంకర్ ప‌ల్లి మార్కెట్ లో ఎవరు తీసుకోవడం లేదు. ఈ విషయంలో బ్యాంకులు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముంది. చిరు వ్యాపారులు అవగాహన లేక తీసుకోకపోవడం కారణంగా ప‌ది రూపాయ‌ల కాయిన్ ఇక చెల్ల‌దా ? అని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు. ఈ కాయిన్ల‌ను ఎవ‌రూ తీసుకోక‌పోవ‌డంతో ఎందుకు పనికిరానిదిగా పది రూపాయల కాయిన్ మిగిలిపోతున్న పరిస్థితి శంకర్ పల్లి మార్కెట్ లో కొనసాగుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement