Thursday, March 23, 2023

ఉరుకు పరుగులతో పరీక్షకు.. నిమిషం రూల్ తో 5గురి విద్యార్ధుల‌కు షాక్

హైద‌రాబాద్ – ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష జరగనుంది. దీంతో ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. నిమిషం నిబంధన అమలులో ఉండటంతో విద్యార్థులు ఉరుకులు పరుగుల మీద పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 9 గంటల తర్వాత పరీక్షా కేంద్రానికి వచ్చిన విద్యార్థులను అధికారులను అనుమతించలేదు. , ఇంటర్‌ పరీక్షల కోసం క‌రీంన‌గ‌ర్ ఉమ్మ‌డి జిల్లాలో 153 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 50 వేల మంది వరకు విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. కాగా రాష్ట్రం మొత్తం మీద ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండియర్‌ విద్యార్థులు కలిపి మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలు రాయ‌నున్నారు.. కాగా నిమిషం రూల్ తో విద్యార్ధులు ఇబ్బంది ప‌డుతున్నారు.. ప‌రీక్షాకేంద్రాల‌కు ఆల‌స్యంగా రావ‌డంతో ఖ‌మ్మం జిల్లాలో ఇద్ద‌రు, మెద‌క్ లో ఒక‌రు, హైద‌రాబాద్,రంగారెడ్డి జిల్లాల‌లో ఇద్ద‌రు విద్యార్ధుల‌ను ప‌రీక్ష‌కు అనుమ‌తించ‌క‌పోవ‌డంతో వారు అక్క‌డే క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు. ఇక కొత్త‌గూడెం – భ‌ద్రాద్రి జిల్లాలో ఒక విద్యార్ధి ప‌రీక్షా కేంద్రంలోనే ఫిట్స్ తో కుప్ప‌కూలిపోయాడు.. వెంట‌నే ఆ విద్యార్ధిని హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు.. ఆ విద్యార్ధి కోలుకున్న‌ట్లు వైద్యులు ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement