Tuesday, April 16, 2024

సింగ‌రేణి బొగ్గు బ్లాకుల వేలానికి నిర‌స‌న‌గా.. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ ద‌హ‌నం..

నల్ల బంగారంతో తెలంగాణకు విద్యుత్తు వెలుగులు పంచుతున్న సింగరేణిని బొంద పెట్టే కుట్రలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెరలేపిందని కోల్ బెల్ట్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాకులను బహిరంగ వేలం వేసేందుకు కేంద్ర సిద్ధమవడంతో కార్మికులు, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. సింగరేణి పరిరక్షణపై శ్రద్ధ ఉండి.. కార్మికుల ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రధాని మోదీ కానీ ఉంటే.. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. మందమర్రి పట్టణంలోని మార్కెట్ ప్రధాన సెంటర్ లో మోదీ దిష్టి బొమ్మ దహనం చేసి మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement