Wednesday, November 27, 2024

NZB | మాజీ సర్పంచ్ ల అరెస్ట్ అక్రమం : మాజీ మంత్రి వేముల‌

వేల్పూర్ /భీంగల్ రూరల్, నవంబర్ 4 (ఆంధ్రప్రభ) : ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ ఉదయం 4గంటలకే మాజీ సర్పంచ్ లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో బంధించడం హేమమైన చర్య అని, ఈ అరెస్టును తాము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నామ‌ని మాజీ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి అన్నారు. 10నెలల కింద అప్పులు తెచ్చి పనులు చేసిన వాటికి బిల్లులు అడిగితే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నార‌న్నారు. వారు ప్రజలకు పనిచేసిన దానికే డబ్బులు ఇవ్వమంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఇంత కోపమొచ్చిందని ప్ర‌శ్నించారు.

ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ కు ఎందుకు మాజీ సర్పంచ్ లంటే ఇంత కోపం అన్నారు. చిన్న కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు డబ్బులు ఉండవు.. పెద్ద పెద్ద బడా కాంట్రాక్టులకు కమిషన్ల కోసం బిల్లులు చెల్లించేందుకు డబ్బులు ఉంటాయన్నారు. సర్పంచ్ లకు డబ్బులు లేవు.. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్ రెడ్డిలకు డబ్బులు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులుంటాయ‌న్నారు.

అలాగే రూ. లక్షన్నర కోట్లతో మూసి ప్రాజెక్ట్ చేపట్టడానికి రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులున్నాయన్నారు. బిల్లులు చెల్లింపు చేయకుండా మాఈ సర్పంచ్ లను ప్రభుత్వం వేధిస్తోంది, భయపెడుతోందన్నారు. ఇప్పటికే గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని, పారిశుద్ధ్యం పడకేసిందన్నారు. మాజీ సర్పంచ్ ల బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. అంతేకాదు ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేసిన మాజీ సర్పంచ్ లను భేషరతుగా వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement