Tuesday, January 7, 2025

MDK | ఐఐటీలు దేశ నిర్మాణానికి వేదిక‌లు.. డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌

ఉమ్మడి మెదక్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఐఐటీలు కేవలం విద్యాసంస్థలు మాత్రమే కాదు.. దేశ నిర్మాణానికి వేదికలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఐఐటీ హైదరాబాద్, కందిలో నిర్వహించిన హైదరాబాద్-ఆస్ట్రేలియా ఇండియా క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ హబ్ వర్క్ షాప్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ…. ఐఐటి హైదరాబాదులో ఇప్పటి వరకు 11,500 పరిశోధన ప్రచురణలు, 320కి పైగా పేటెంట్లు, స్టార్టప్పుల ద్వారా 1500కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం గొప్ప మార్పుగా తాము చూస్తున్నామన్నారు.

ఆస్ట్రేలియా-ఇండియా క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ హబ్ కింద మోనాష్ యూనివర్సిటీ సహకారంతో చేపట్టిన కార్యక్రమాలు కేవలం తెలంగాణకే కాదు.. భారతదేశానికే కాదు.. ప్రపంచానికే కీలకమ‌న్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని రూపొందించడంలో ఈ వర్క్ షాప్ సహకార స్ఫూర్తికి అద్దం పడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ పరిశోధన అన్నారు. వాటి సంబంధిత సైన్స్ ఆధార కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుందని, క్లిష్టమైన ఖనిజాలు పారిశ్రామిక ముడి పదార్థాలు మాత్రమే కాదు, అవి హరిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి ఉపయోగపడతాయన్నారు.

ఐఐటీల ఆలోచనలు పరిశ్రమలను పునర్ నిర్వచిస్తాయి, ఆర్థిక వ్యవస్థలను పునర్మిస్తాయన్నారు. గ్రీన్ ఎనర్జీ, స్థిరమైన టెక్నాలజీ, శాస్త్రీయ ఆవిష్కరణల్లో దేశంలో మొదటి స్థానంలో నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని తెలియజేసారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement