Tuesday, September 19, 2023

భూమ్మీద 5 సెకన్లు ఆక్సిజన్ మాయమైతే..?

ప్రతీ జీవి బతకడానికి ఆక్సిజన్ తప్పనిసరి. ఒకవేళ మనం జీవిస్తున్న భూమ్మీద 5సెకన్ల పాటు ఆక్సిజన్ మాయమైతే ఏం జరుగుతుంది..? ఈ ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా.? అవును.. ఒకవేళ నిజంగానే ఆక్సిజన్ మాయమైతే 5 సెకన్లు ఆక్సిజన్ లేకపోతే మనుషులు అయితే చనిపోరు. ఎందుకంటే… మనలో చాలామంది 20-30సెకన్లు ఊపిరి బిగబట్టి ఉండగలరు. మరికొందరు నిమిషం కూడా ఉంటారు. గానీ.. పర్యావరణంపై మాత్రం చాలా ప్రభావం పడుతుందట. ప్రపంచం ఐదు సెకన్ల పాటు ఆక్సిజన్ ను కోల్పోతే ఈ భూమి మనం నివసించడానికి అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం అవుతుంది. గాలి పీడనం 21 శాతం తగ్గి.. మన లోపలి చెవి పగిలిపోతుందట. ఆక్సిజన్ లేకుండా ఎలక్ట్రిక్ మినహా అన్ని వాహనాలు ఆగిపోతాయట. ఆకాశంలో ఎగురుతున్న విమానాలు భూమిపై పడతాయి. పెట్రోల్, డీజిల్ తో నడుస్తున్న లక్షలాది కార్లు రోడ్లపై ఆగిపోతాయి. అందుకే మొక్కలు నాటండి.. చెట్లను సంరక్షించండి అని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కోరారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement