Wednesday, November 13, 2024

TG: కేటీఆర్ ను వదిలేది లే… కొండా సురేఖ

కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేది లేదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రస్తుత కేబినెట్ మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. కేటీఆర్ నన్ను కించపరిచే విధంగా మాట్లాడాడన్నారు. తాను వేదనకు గురై ఆయన గురించి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందన్నారు. అనుకోని సందర్భంలో ఓ కుటుంబం గురించి మాట్లాడానన్నారు.

అనుకోకుండా నా నోట్లో నుంచి ఆ వ్యాఖ్యలు రావాల్సి వచ్చిందన్నారు. ఆ కుటుంబ సభ్యుల ట్వీట్లు చూసిన తర్వాత నాకు బాధనిపించిందన్నారు. ఆ కుటుంబాన్ని నా వ్యాఖ్యలు నొప్పించాయని తెలిసి బాధపడ్డానని తెలిపారు. నేను పడ్డ బాధ వాళ్లు పడకూడదనే, నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటూ, ట్విట్టర్ లో పోస్ట్ చేశానని తెలిపారు. కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేది లేదన్నారు. కేటీఆర్ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. దొంగే దొంగ అనేలా కేటీఆర్ ప్రవర్తన ఉందన్నారు. కేటీఆర్ నోటీసుల మీద లీగల్ గా ముందుకు వెళ్తానని మంత్రి కొండా సురేఖ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement