Tuesday, April 23, 2024

HZB: ఆరో రౌండ్ లోనూ.. ఈటల హవా!

హుజురాబాద్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లీడ్‌లో కొనసాగుతున్నారు. తొలి రౌండ్‌లో 166, రెండవ రౌండ్‌లో 192, మూడవ రౌండ్‌లో 911 ఓట్ల ఆధిక్యతను సాధించారు. నాలుగో రౌండ్‌ ముగిసే సరికి 1,825 ఓట్ల లీడ్‌లో ఉండగా.. ఐదో రౌండ్‌లో కూడా ఈటల తన సత్తా చాటారు. ఆరో రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 26,983, టీఆర్ఎస్ అభ్యర్థి 23,797.. కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ కు 992 ఓట్లు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement