Friday, December 6, 2024

HYDRAA – రెండు నెలల్లో బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం – హైడ్రా చీఫ్ రంగనాత్

ఈ ప్రాంతంలో ఒక్క ఇళ్లు కూడా కూల్చ‌బోం
అక్కడి నివాసితుల‌కు హైడ్రా చీఫ్ భ‌రోసా
నేడు అక్క‌డి ప్రాంతాన్ని సంద‌ర్శించిన రంగ‌నాథ్

హైద‌రాబాద్ – రెండు నెలల్లో బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాధ్. బతుకమ్మకుంట ప్రాంతంలో ఉన్న ఇండ్ల కూల్చివేతలు ఉండవన్నారు. బతుకమ్మకుంటను పునరుద్దరిస్తామన్నారు. ప్రస్తుతమున్న ఐదెకరాల విస్తీర్ణంలోనే పునరుద్దణ చేస్తామన్నారు. బతుకమ్మకుంటలోకి వరద నీరు వచ్చే మార్గాలపై రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో చర్చిస్తామన్నారు. నేడు రంగ‌నాథ్ బ‌తుక‌మ్మ కుంట ప్రాంతాన్ని సంద‌ర్శించారు.. అనంత‌రం స్థానికులతో మాట్లాడారు. వారిలో ఉన్న భ‌యాన్ని తొల‌గించారు..

కూల్చివేతలు చేపట్టడానికి రాలేదని స్పష్టం చేశారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. బతుకమ్మ కుంటలో మొలిచిన చెట్లను జెసిబితో తో తొలగిస్తున్నట్లు తెలిపారు. దీంతో స్థానికులు అందరూ రంగనాథ్ మాటలకు చప్పట్లు కొట్టారు. ఇప్పటి వరకు ఉన్న ఏ ఒక్క నిర్మాణాన్ని కూడా కూల్చమని హామీ ఇచ్చిచారు. ఇప్పుడు ఉన్న కుంటను అభివృద్ధి చేసి చుట్టూ పార్క్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

అనంత‌రం ఆయన మీడియాతో మాట్లాడుతూ , హైడ్రా నోటీసులు ఇచ్చే అధికారం ఉందని, హైడ్రా నోటీసులు ఆక్రమణదారులకు వెళ్తూనే ఉంటాయన్నారు. నాగారంలో రోడ్డు కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను ఈరోజు కూల్చేశామన్నారు. ఐదు కాలనీలకు వెళ్ళే రొడ్డును ఆక్రమించారని క్లారిటీ ఇచ్చారు. త‌మ‌కు స్థానికులు కంప్లెయింట్ చేయడంతో సర్వే చేశామన్నారు. 15 ఏళ్లుగా కబ్జాలో ఉన్న నిర్మాణాలు తొలగించామని రంగనాథ్ పేర్కొన్నారు.

- Advertisement -

నాగారంలో ఆక్ర‌మ‌ణ‌లు కూల్చివేత
నాగారం మున్సిపాలిటీ పరిధిలోనీ సిరిపురం కాలనీలో రోడ్డు ఆక్రమణను హైడ్రా అధికారులు కూల్చివేశారు. తమ కాలనీలో రోడ్డు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ స్థానికులు ఇచ్చిన పిర్యాదు మేరకు విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు రోడ్డు ఆక్రమణ నిజమేనని నిర్ధారించారు. నేటి ఉదయం సిరిపురం కాలనీకి చేరుకున్న రెండు హైడ్రా బృందాలు జేసిబీ సాయంతో ఆక్రమణలు కూల్చివేశారు. రోడ్డు కబ్జా చేసిన పాపి రెడ్డిపై కూడా చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement