Monday, October 7, 2024

HYDRAA – రూటు మార్చిన హైడ్రా

హైదరాబాద్ – అక్రమ నిర్మాణమైన జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అనుమతులు ఉంటే హైడ్రా కూల్చివేయదు. అనుమతులు లేని నిర్మాణాలపై మాత్రమే హైడ్రా ఫోకస్ పెట్టనుంది. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో హైడ్రా ఆచీతూచి అడుగులు వేస్తోంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా కూల్చివేతలు చేయాలని హైడ్రా నిర్ణయించినట్లు సమాచారం.

.హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) రూటు మార్చింది. హై స్పీడ్ కూల్చివేతలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దూకుడు తగ్గించనుంది. ఈ వీకెండ్ హైడ్రా కూల్చివేతల వాయిదా వెనుక గ్రౌండ్ వర్క్ ఉంది. వారాంతం కూల్చివేతల విమర్శలతో.. ఇక సాధారణ రోజుల్లోనే కూల్చివేతలు చేసే యోచనలో హైడ్రా ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

అలాగే లీగల్ టీం సలహాలు తీసుకున్న తర్వాతే కూల్చివేతల ప్రక్రియ కొనసాగనున్నట్లు తెలియవచ్చింది. అక్రమ నిర్మాణమైన జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అనుమతులు ఉంటే కూల్చివేయరు. అనుమతులు లేని నిర్మాణాలపై మాత్రమే హైడ్రా ఫోకస్ పెట్టనుంది. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో హైడ్రా ఆచీతూచి అడుగులు వేస్తోంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా కూల్చివేతలు చేయాలని హైడ్రా నిర్ణయించినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement