Saturday, April 20, 2024

హాల్‌ టిక్కెట్‌ ఆఫర్‌ను ప్రకటించిన వండర్‌లా హాలీడేస్‌

భారతదేశంలో అతిపెద్ద అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ చైన్‌, వండర్‌లా హాలీడేస్‌ తమ హాల్‌ టిక్కెట్‌ ఆఫర్‌తో తిరిగి వచ్చింది. 2022–23 విద్యా సంవత్సరంలో తమ 10, 11, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరైన విద్యార్ధులకు అత్యంత ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ఈ ఆఫర్‌లో భాగంగా అందిస్తారు. ఈ డిస్కౌంట్ ను వండర్‌లా బెంగళూరు, హైదరాబాద్‌, కొచ్చి పార్క్‌ల వద్ద అందిస్తుంది. తమ ఒరిజినల్ హాల్‌టిక్కెట్లను చూపడం ద్వారా విద్యార్ధులు వండర్‌లా పార్క్‌ ప్రవేశ టిక్కెట్ల పై 35% డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్‌ను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో విద్యార్ధులు క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

అయితే విద్యార్ధులు తమ ప్రస్తుత సంవత్సర హాల్‌ టిక్కెట్‌ను పార్క్‌ లోపలకు ప్రవేశిస్తున్నప్పుడు ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. సందర్శకులు తమ ప్రవేశ టిక్కెట్లను ముందుగా ఆన్‌లైన్‌ పోర్టల్‌ https://bookings.wonderla.com/ వద్ద బుక్‌ చేసుకోవడాన్ని వండర్‌లా ప్రోత్సహిస్తుంది. వినియోగదారులు నేరుగా తమ టిక్కెట్లను పార్క్‌ కౌంటర్ల వద్ద కూడా కొనుగోలు చేయవచ్చు. మరింత సమాచారం కోసం www.wonderla.com చూడవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement