Thursday, April 25, 2024

లైగర్ లోని అక్డిప‌క్డి పాటతో.. విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ కు పండగే..

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నవిజయ్ దేవరకొండ, అనన్య పాండే నటించిన లైగర్ సినిమా నుండి మొదటి పాట అక్డిపడి విడుదలైంది. ఈ ట్రాక్ తన బీట్స్ తో మిమ్మల్ని కట్టిపడేస్తుంది. విజయ్ దేవరకొండ అందాల నటి అనన్య పాండేతో కలిసి చేసిన ఈ డాన్స్ టాలీవుడ్, బాలీవుడ్ సంగీతాలు కలగలసిన ఒక అద్భుతమైన సమ్మేళనం. ఈ పాట గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… 2 సంవత్సరాల కృషి తరువాత, ఆ సమయం వచ్చిందన్నారు. త‌న మాస్ యాక్షన్ పాన్ ఇండియా మొదటి సినిమా లైగర్ సినిమా చూసేందుకు అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశారన్నారు. తాను హిందీలో నటించడాన్ని హిందీ ప్రేక్షకులు కూడా చూసి ఆనందిస్తారని త‌నకు సంతోషంగా ఉందన్నారు. త‌మ ఈ సినిమా ప్రచారంలో భాగంగా మాస్ డాన్స్ అక్డిపడి ని విడుదల చేశామన్నారు.

అనన్య పాండే మాట్లాడుతూ.. ప్రతిభ కలిగిన నటుడు విజయ్ దేవరకొండతో కలిసి నటించడం ఒక అద్భుతమైన అనుభవమ‌న్నారు. ప్రతి ఒక్క డాన్స్ స్టెప్, ఇంకా ఇద్దరం పోటీ పడి చేయడం త‌నకు ఎంతో నచ్చిందన్నారు. అక్డిపడి ఎంత అద్భుతమైనదంటే, ఒకసారి మీరు ఆ పాటకు డాన్స్ చేయడం మొదలుపెడితే మీరు ఆపలేరన్నారు. అలాగే ద‌ర్శ‌కుడు పూరిజ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ…. విజయ్ ఒక పక్కా రౌడీగా చేస్తూ కూడా అందంగా కనిపించే తీరు త‌నకెంతో ఇష్ఠమ‌ని, అతనిలోని ప్రతిభను వెలికితీసే ఒక పాటను ఈ సినిమాలో చేర్చకుండా ఉండలేకపోయానన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement