Saturday, April 20, 2024

అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్ ను సమర్పించిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా

అజ్మీర్ షరీఫ్ దర్గాను ఐవీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా దంపతులు సకుటుంబ సమేతంగా దర్శనం చేసుకొని, ఛాదర్ ను సమర్పించారు. రాజస్థాన్ లోని ప్రసిద్ధ అజ్మీర్ షరీఫ్ దర్గాను ఉప్పల శ్రీనివాస్ గుప్తా కుటుంబ సభ్యులు సందర్శించి దర్గాకు ఛాదర్ ను సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా.. దర్గా కమిటీ సభ్యులు, సాంప్రదాయ పద్దతుల్లో ఆశీర్వాదాలు అందించారు. తదుపరి దర్గా లో ఆహార అన్న ప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణకు బాటలు వేస్తూ.. సంక్షేమంలో, అభివృద్ధిలో తెలంగాణను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని, తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం 14 ఏండ్ల పాటు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడి, విజయం సాధించిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా కూడా విజయవంతమయ్యారన్నారు. దేశ రాజకీయాల్లో మార్పు రావాలని, ఆ మార్పు తెలంగాణ రాష్ట్రం నుంచే మొదలవ్వాలని ఆకాంక్షించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని దేశవ్యాప్తం చేయాలన్న కోరిక, కేంద్రంలోని బీజేపీ విద్వేష, విభజన రాజకీయాలపై పోరాటం చేయాలన్న ఆశయం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో పాలనలో గుణాత్మక మార్పు కోసం.. బీఆర్ఎస్ కృషి చేస్తుందని తెలిపారు. భారత రాజకీయ యవనికపై కేసీఆర్ మార్కు రాజకీయాలను చూడబోతున్నామని తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బీఅర్ఎస్ అధినేత సీఎం కేసిఆర్..దేశానికి దిక్సూచిగా నిలవాలని, దేశ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడానికి, దేశంలో గుణాత్మక మార్పు కోసం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ విజయం సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల దంపతులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా – స్వప్న, కుమారులు సాయి కిరణ్, సాయి తేజ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement