Wednesday, April 24, 2024

నిరుపేద యువతి వివాహానికి ఉప్పల శ్రీనివాస్ గుప్తా చేయూత

నిరుపేద గౌడ కుటుంబానికి చెందిన పెళ్లికూతురు వివాహానికి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా
పుస్తెమట్టెలు అందజేశారు. ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ గ్రామానికి చెందిన బీసీ బీ గౌడ కులానికి చెందిన డ్రైవర్ వృత్తి చేసే బోలగాని మోహన్ గౌడ్, నాగమణిల కూతురు లయశ్రీ వివాహానికి నాగోల్ లోని తన కార్యాలయంలో పుస్తెమట్టెలు, చీర, గాజులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement