Thursday, April 18, 2024

పేద వ‌ధువు వివాహానికి ఉప్పల ఫౌండేషన్ అండ..

ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామంతపూర్ లో నివాసం ఉంటున్న SC, BCల‌కు చెంది కూలీ పని చేసుకునే సోంపరి మాధవి కీ,శే, బాబూరావుల కూతురు మహేశ్వరి, మంగిలిపల్లి సునీత కీ,శే, శంకర్ ల కూతురు అంజలిల వివాహం సందర్భంగా వారి కార్యాలయంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త పుస్తె మట్టెలు, చీర, గాజులు అంద‌జేశారు. తండ్రులు లేని పేద అమ్మాయిలకు ఉప్పల ఫౌండేషన్ అండ నిల‌వ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్, నవీన్, బెలిదే నవీన్, సంతోష్, శ్యామ్, వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement