Friday, April 19, 2024

పేదింటి యువతికి ఉప్పల ఫౌండేషన్ చేయూత

పేదింటి యువ‌తికి ఉప్ప‌ల ఫౌండేష‌న్ చేయూత‌నందించింది. నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట భువనగిరికి చెందిన పాల జంగయ్య గౌడ్, లక్ష్మీ దంపతుల కూతురు దివ్య వివాహానికి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పుస్తె మట్టెలు, చీర, గాజులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement