Tuesday, May 18, 2021

తెలంగాణ ఐసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ ఐసెట్‌ నోటిఫికేషన్‌ను కంట్రోలర్‌ మహేందర్‌రెడ్డి విడుదల చేశారు. ఈ నెల 7 నుంచి జూన్‌ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ. 250 అపరాధ రుసుముతో జూన్‌ 30 వరకు, రూ. 500 అపరాధ రుసుముతో జులై 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 19, 20 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబరు 17న ఫలితాలు విడుదల చేయనున్నట్లు మహేందర్‌రెడ్డి తెలిపారు.ఆగస్టు 13 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 రీజినల్‌ సెంటర్లలోని 60 కేంద్రాల‌లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News