Thursday, March 28, 2024

మినీ పుర పోరు – టి ఆర్ ‘ఎస్’ – విప‌క్షాలు మైన‌స్..

ప్రచారపర్వంపై కరోనా ఎఫెక్ట్
గెలుపు కోసం తెరాస వ్యూహరచన
ఇంటింటి ప్రచారంలో ముందంజ
వెనుకబడిన కమలం పార్టీ
డిజిటల్‌ ప్రచారంపైనే భాజపా ఫోకస్‌
ఇది సమయంకాదంటున్న కాంగ్రెస్‌

హైదరాబాద్‌, : మినీ మునిసిపోల్స్‌పై కరోనా ఎఫెక్ట్‌ కనబడుతోంది. వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్‌ పురపాలక సంఘాలకు ఈనెల 30న ఎన్నికలు జరగనుండగా, ప్రచారంతో పాటు ఎన్నికల వ్యూహాల విషయంలోనూ అన్ని పార్టీలపైనా కరోనా ప్రభావం తీవ్రంగా కనబడు తోంది. మిగతా పార్టీలతో పోలిస్తే టీఆర్‌ఎస్‌ దూకు డుగా ఉంది. ఖమ్మం మినహా ఇతర నగర, పుర పాలికల్లో టీఆర్‌ఎస్‌ ఒంట రిగా పోటీ చేస్తోంది.ఖమ్మంలో సీపీఐతో పొత్తు కుదుర్చుకుంది. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యే సరికి వరంగల్‌లో కొంత అసమ్మతి బెడద ఉన్నా మిగిలిన చోట్ల సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడింది. కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగియ డంతో బరిలో నిలిచే అభ్యర్థుల లెక్కతేలింది. ఆయా పార్టీల నుంచి పోటీచేసే అభ్యర్థులు ప్రచార పర్వంలోకి దిగారు. వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ 66 డివిజన్లలో పోటీ చేస్తోంది. పార్టీ టికెట్లకు తీవ్రమైన పోటీ ఏర్పడగా.. పెద్దఎత్తున నామినేషన్లు వేశారు. మంత్రులతో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ అందరితోనూ చర్చించి ఎక్కువ మందిని ఉపసం హరింపజేసింది. కొందరు ససేమిరా అన్నా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఇతర పార్టీలవైపు చూడకుండా కమిటీ చివరి రోజు బీఫారాలు అందజేసింది. ఉపసంహరణ అనంతరం పదిచోట్ల అసమ్మతి సమస్య ఉంది. గత పాలక వర్గంలో టీఆర్‌ఎస్‌కు 53 మంది కార్పొరేటర్లు ఉండగా, 24 మందికి మాత్రమే తిరిగి టికెట్లిచ్చింది. టీఆర్‌ఎస్‌ ముందునుండీ ఎన్నికల విషయంలో వ్యూహాత్మ కంగా ఉండగా, సమయం తక్కువగా ఉండడంతో బీజేపీఎక్కువగా.. డిజిటల్‌ ప్రచారంపై ఫోకస్‌ పెట్టింది. కాంగ్రెస్‌ పార్టీ ఓ వైపు క్షేత్రస్ధాయిలో ప్రచారం చేస్తూనే, మరోవైపు కోవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతోంది.

ఖమ్మంలో.. పొత్తుపాలిటిక్స్‌
ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో 60 స్థానా లకుగానూ 57 స్థానాల్లో టీఆర్‌ఎస్‌, మూడింట సీపీఐ బరిలో ఉన్నాయి. పదో డివిజన్‌లో మిగిలిన అభ్య ర్థులు ఉపసంహరించుకోవడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏకగ్రీవం కానున్నారు. మిగిలిన 56 స్థానాలకు రెండు, మూడుచోట్ల తిరుగుబాటుదారుల సమస్య ఉంది. గత పాలకవర్గంలో 43 మంది టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ఉండగా, వారిలో 21 మందికి పార్టీ టికెట్లిచ్చింది. ఇక్కడ టీఆర్‌ఎస్‌ నుండి నలుగురు దిగ్గజ నేతలుం డగా, మంత్రి పువ్వాడ అజయ్‌ గెలుపు బాధ్యతను తన భుజాలమీద వేసుకుని పనిచేస్తున్నారు. సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూరు, నకిరేకల్‌లలో అధికార పార్టీ నేతలు సమయస్ఫూర్తితో తిరుగుబాటుదారుల బెడదను నివారించారు. ఖమ్మం కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌ సీపీఐతో, కాంగ్రెస్‌ సీపీఎంతో, బీజేపీ జనసేనతో కలిసి బరిలో దిగాయి. టీఆర్‌ఎస్‌ 57 డివిజన్లలో, సీపీఐ మూడు స్థానాల్లో అభ్యర్థులను నిలిపాయి. కాంగ్రెస్‌ 48 స్థానాల్లో, సీపీఎం 9 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. బీజేపీ 47 చోట్ల, జనసేన ఐదుచోట్ల అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎనిమిది డివిజన్లలో అభ్యర్థులను బరిలో నిలి పింది. వరంగల్‌ కార్పొరేషన్‌లో ఎలాంటి పొత్తులు లేకుండానే టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలో బరిలో దిగాయి. మొత్తం 66 డివిజన్లలోనూ టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులను నిలిపాయి. కాంగ్రెస్‌ 65 చోట్ల పోటీ చేస్తూ ఒక డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ప్రక టించింది. సీపీఐ 14 డివిజన్లలో, సీపీఐ ఏడింటిలో, టీడీపీ 14 చోట్లు, ఎంఐఎం నాలుగుచోట్ల, జనసేన నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. సిద్దిపేటలో 43 డివిజన్లు ఉండగా టీఆర్‌ఎస్‌ అన్ని స్థానాల్లో పోటీలో ఉండగా, కాంగ్రెస్‌ అభ్యర్థులు 30 స్థానాల్లో ఉన్నారు. ఇక్కడ ఒక వార్డులో బీఫాం పొందిన కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. బీజేపీ 40 చోట్ల, ఎంఐఎం నాలుగు చోట్ల, సీపీఐ, సీపీఎంలు చెరో స్థానంలో అభ్యర్థులను నిలిపాయి. అచ్చంపేటలో 20 వార్డుల్లోనూ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. నకిరేకల్‌లో 20 వార్డుల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు 16చోట్ల పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా, బీజేపీ 14, సీపీఎం మూడుచోట్ల పోటీ చేస్తున్నాయి. జడ్చర్లలోని 27 వార్డుల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు బరిలో ఉండగా, కాంగ్రెస్‌ 25 స్థానాల్లో, బీజేపీ 22 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎంఐఎం ఏడు చోట్ల, సీపీఐ మూడు స్థానాల్లో, సీపీఎం ఒకచోట అభ్యర్థులను నిలిపాయి. కొత్తూరులో 12 వార్డులు ఉండగా అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement