Wednesday, April 24, 2024

హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

బక్రీద్‌ పండగ సందర్భంగా బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మీరాలం ట్యాంక్‌ ఈద్గా, హాకీ గ్రౌండ్‌, మాసబ్‌ ట్యాంక్‌, లంగర్‌ హౌస్‌ ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు, ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటుందని సీపీ తెలిపారు.

వివిధ ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షల వివరాలు:
★ ఈద్గాకు ప్రార్థనల కోసం వచ్చే వారు పురానాపూల్‌, కామాటిపురా, కిషన్‌బాగ్‌, బహదూర్‌పురా ఎక్స్‌ రోడ్డు మీదుగా ఉదయం 8 నుంచి 11.30 గంటల మధ్యలో ఈ రూట్లలో రావాలని సూచించారు. ఈ వాహనాలను జూపార్కు ప్రాంతంలో పార్కు చేయాలి.
★ శివరాంపల్లి వైపు నుంచి ప్రార్థనల కోసం వచ్చే అన్ని వాహనాలకు దానమ్మ హాట్స్‌ రోడ్డు నుంచి ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకు అనుమతిస్తారు. ఈ సమయంలో సాధారణ ట్రాఫిక్‌ను ఈద్గా వైపు అనుమతించరు. దానమ్మ క్రాస్‌రోడ్స్‌ నుంచి శాస్త్రిపురం, ఎన్‌ఎస్‌కుంట రూట్‌లలో వెళ్లాలి. యూసుఫ్‌ పార్కింగ్‌, మజార్‌ పార్కింగ్‌, జయేశ్‌ పార్కింగ్‌, మోడ్రన్‌ సా మిల్‌ పార్కింగ్‌ ఈద్గా ఎదుట ఉన్న ప్రధాన రోడ్డు, మిర్‌ అలామ్‌ ఫిల్టర్‌ బెడ్‌, యాదవ్‌ పార్కింగ్‌లలో వాహనాలు పార్కు చేయాలి.
★ కాలాపత్తర్‌ నుంచి ఈద్గాకు వచ్చే వాహనాలు కాలాపత్తర్‌ ఠాణా వైపు ఉదయం 8 నుంచి 11.30గంటల వరకు అనుమతిస్తారు. సాధారణ వాహనాలను మోచీ కాలనీ, బహదూర్‌పురా వైపు మళ్లిస్తారు. ఈ రూట్‌లో వచ్చే వాహనాలు భయ్యా పార్కింగ్‌, మోడ్రన్‌ పెట్రోల్‌ బంక్‌, బీఎన్‌కే కాలనీల్లో పార్కు చేయాలి.
★ ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు పురానాపూల్‌ నుంచి బహదూర్‌పురా వైపు వెళ్లే భారీ వాహనాలను జియాగూడ, సిటీ కాలేజీ వైపు మళ్లిస్తారు.
★ ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు శంషాబాద్‌, రాజేంద్రనగర్‌ వైపు నుంచి బహదూర్‌పురా వైపు వచ్చే వాహనాలను ఆరాంఘర్‌ జంక్షన్‌ వద్ద నుంచి మళ్లిస్తారు.

ఈ వార్త కూడా చదవండి: ఒకే వ్యక్తిలో ఒకేసారి రెండు వేరియంట్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement