Tuesday, October 19, 2021

హైద‌రాబాద్‌లో ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు

హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. న‌గ‌రంలో సోమవారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని పోలీసులు తెలిపారు. 24 గంట‌ల్లో నిమ‌జ్జ‌న ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని పోలీసులు నిర్ణ‌యించిన‌ప్ప‌టికీ ఆల‌స్య‌మైంది. ట్యాంక్‌బండ్‌కు వ‌చ్చే ర‌హ‌దారుల‌పై గ‌ణ‌నాథుల‌తో వాహ‌నాలు భారీగా నిలిచిపోయాయి. ట్యాంక్‌బండ్‌, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ వ‌ద్ద వాహ‌నాలు నిలిచాయి. దీంతో ఈ ప్రాంతాల్లో మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉండ‌నున్నాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News