Thursday, March 28, 2024

ముత్తూట్ ఫైనాన్స్‌లో చోరీకి య‌త్నం

హైద‌రాబాద్‌: న‌గ‌ర శివార్ల‌లోని దుండిగ‌ల్‌లో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్‌లో దుండ‌గులు చోరీకి విఫ‌ల‌య‌త్నం చేశారు. బుధ‌వారం అర్థ‌రాత్రి దాటిన తర్వాత దుండిగ‌ల్ ప‌రిధి గండిమైస‌మ్మ‌లో ఉన్న‌ ముత్తూట్ ఫైనాన్స్ గోడ‌కు క‌న్నం వేసిన గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు.. అందులోకి ప్ర‌వేశించారు. దొంగ‌తనం చేయడానికి ప్ర‌య‌త్నిస్తుండ‌గా అలారం మోగ‌డంతో దొంగ‌ల ముఠా అక్క‌డి నుంచి ప‌రార‌య్యింది. గురువారం విధుల‌కు వ‌చ్చిన సిబ్బంది విష‌యాన్ని గ్ర‌హించి.. పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నా స్థ‌లాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలించి ఆధారాలు సేక‌రించారు. చోరీ య‌త్నం జ‌రిగిన ప్రాంతాన్ని ఏసీపీ రామ‌లింగ‌రాజు ప‌రిశీలించారు. ఈ ఘ‌న‌ట‌పై కేసు న‌మోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement