Wednesday, April 24, 2024

థియేటర్లు ఓపెన్.. సినిమా హాళ్ల వద్ద సందడి

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్‎తో విజృంభించడంతో మూతపడిన సినిమా థియేటర్లు మళ్లీ తెరుచుకున్నాయి. పలు కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడంతో థియేటర్ల వద్ద సినీ ప్రియులు సందడి చేస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ నగరంలో తిరిగి థియేటర్లు తెరుచుకున్నాయి. 100 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలను ప్రదర్శించనున్నారు. దీంతో పలు థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. శుక్రవారం పలు కొత్త సినిమాలు విడుదల నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‎లోని థియేటర్లలో రద్దీగా ఉంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో నేటి నుంచి పార్కింగ్ చార్జీలు కూడా అమలుకానున్నాయి.

ఇక, ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీతో పర్మిషన్‌ ఇచ్చారు. ఇటీవల కర్ఫ్యూ సమయాల సడలింపులు ఇచ్చే సందర్భంలోనే థియేటర్ల రీ ఓపెనింగ్‎కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నలిచ్చింది. అయితే, నిర్మాతలతో ఎగ్జిబిటర్ల వివాదం ఓ కొలిక్కిరాకపోవడంతో థియేటర్లు తెరుచుకోవడం ఆలస్యమైంది.

ఇదిఇలా ఉంటే.. ఏపీలో నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్లు తెరుస్తారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది. ఫ్యామిలీ ప్రేక్షకులు అధికంగా నైట్ షోలకే థియేటర్లకు వస్తారు. అయితే, ప్రభుత్వం కర్ఫ్యూను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటలవకు అమలు చేయనుంది. ఈ క్రమంలో రోజుకు మూడు ఆటలతో థియేటర్లు ప్రదర్శించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: ఏపీలో మరోసారి కర్ఫ్యూ పొడిగింపు.. కొత్త టైమింగ్స్ ఇవే!

Advertisement

తాజా వార్తలు

Advertisement