Monday, December 9, 2024

TG – గ్రంథాలయ సంస్థల చైర్మన్ల నియామకం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ తెలంగాణలోని గ్రంథాలయ సంస్థల చైర్మన్ల నియామకంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. పలు జిల్లాల్లో వీరి కొరత ఉందని, అందులో ఆయా జిల్లాలో గ్రంథాలయ చైర్మన్ల నియామకాలకు చేపట్టాలని నిర్ణయించుకుంది.

ఈ నేపథ్యంలోనే పలు జిల్లాల గ్రంథాయల సంస్థలకు చైర్మన్ల నియామకాలకు ఈరోజు పూర్తి చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కొంత కాలంగా ఈ పదవుల నియామకం దృష్టి సారించామని, నేటితో వీటిని ముగించామని సర్కార్ చెప్పింది.

ఈరోజు 13 జిల్లాల గ్రంథాలయ సంస్థల ఛైర్మన్లను ప్రభుత్వం ప్రకటించింది.నిర్మల్- సయ్యద్ అర్జుమంద్ అలీసిరిసిల్ల- నాగుల సత్యనారాయణ గౌడ్ కరీంనగర్- సత్తు మల్లయ్య రంగారెడ్డి- ఎలుగంటి మధుసూధన్ రెడ్డివనపర్తి – జి. గోవర్ధన్సంగారెడ్డి- గొల్ల అంజయ్యకామారెడ్డి- మద్ది చంద్రకాంత్ రెడ్డి మెదక్- సుహాసిని రెడ్డి నారాయణ్‌పేట్ – వరాల విజయ్ కుమార్ నాగర్ కర్నూల్ – జి. రాజేందర్ వికారాబాద్- శేరి రాజేశ్ రెడ్డి మహబూబ్‌నగర్- మల్లు నరసింహారెడ్డిజోగులాంబ గద్వాల- నీలి శ్రీనివాసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement