Saturday, April 20, 2024

అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోన్న తెలంగాణ… మంత్రి కేటీఆర్

అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దూసుకుపోతోందని… మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో మీడియా ఇన్ తెలంగాణ సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… మీడియాలో పాజిటివ్ కంటే నెగిటివ్ వార్తలే ఎక్కువగా వస్తున్నాయన్నారు. 45ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం పెరిగిందన్నారు. 30ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందన్నారు. ఎవరు ఏం తినాలో.. హిజాబ్ వేసుకోవాలా వద్దా అనే వార్తలు ప్రధానంగా వస్తున్నాయన్నారు. కేంద్రం తీరు అయితే జుమ్లా.. లేకుంటే హమ్లా అన్నట్లుగా ఉందన్నారు. పెద్దనోట్ల రద్దుతో ఏం జరిగిందని ప్రశ్నించారు. నోట్ల చెలామణి 15లక్షల కోట్ల నుంచి 30లక్షల కోట్ల వరకు పెరిగిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement