Monday, July 26, 2021

మాస్క్ ధ‌రించ‌ని గ్రేట‌ర్ హైద‌రాబాద్ మాజీ మేయ‌ర్ – జ‌రిమానా వాత‌..

హైద‌రాబాద్ – మాస్క్ ధ‌రించ‌కుండా కారులో ప్ర‌యాణిస్తున్న గ్రేట‌ర్ హైద‌రాబాద్ మాజీ మేయ‌ర్, మాజీ ఎమ్మెల్యే తీగ‌ల కృష్ణారెడ్డికి భారీగా జ‌రిమానా విధించారు పోలీసులు..స‌రూర్‌న‌గ‌ర్ పోలీసులు క‌ర్మ‌న్‌ఘాట్ చౌర‌స్తా వ‌ద్ద వాహ‌నాల‌ను త‌నిఖీ చేశారు. ఈ క్రమంలో వాహనాల్లో వెళ్తూ మాస్కు ధ‌రించ‌ని వారికి పోలీసులు జ‌రిమానా విధించారు. ఇదే స‌మ‌యంలో మాజీ మేయ‌ర్ తీగ‌ల కృష్ణా రెడ్డి త‌న కారులో వెళ్తుండ‌గా.. పోలీసులు ఆపారు. మాస్కు ధ‌రించ‌ని తీగ‌ల కృష్ణారెడ్డికి స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ ముఖేష్ రూ. 1000 జరిమానా విధించారు. దీంతో తీగ‌ల కృష్ణారెడ్డి, ముఖేష్‌కు మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కారులో వెళ్లినా కూడా మాస్కు ధ‌రించాల్సిందేన‌ని తీగ‌ల‌కు ఎస్ఐ తేల్చిచెప్పారు. దీంతో ఆయ‌న జ‌రిమానాను చెల్లించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాల్సిందేనని సరూర్‌నగర్‌ పోలీసులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News