Monday, September 25, 2023

టెక్నాల‌జీ మాల్ ఈ గ్యాలెరియాను ప్రారంభించిన ఎల్అండ్ టీ హైద‌రాబాద్ మెట్రో

హైద‌రాబాద్ న‌గ‌ర టెక్నాల‌జీ డీఎన్ఏకు అనుగుణంగా ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ( హైద‌రాబాద్ ) లిమిటెడ్ త‌మ హైటెక్ సిటీ మాల్ ను ఈ-గ్యాలెరియా గా పునః ప్రారంభించింది. ఈసంద‌ర్భంగా ఎల్ అండ్ టీ ఎంఆర్ హెచ్ఎల్ ఎండీ, సీఈఓ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ… త‌మ ట్రాన్సిట్ ఆధారిత అభివృద్ధికోసం త‌మ వృద్ధి ప్ర‌ణాళిక‌ల్లో భాగంగా ఈ – గ్యాలెరియాను ప్రారంభించ‌డం ప‌ట్ల చాలా సంతోషంగా ఉన్నామ‌న్నారు. బ్రాండ్ల‌న్నీ కూడా నూత‌న మార్కెటింగ్ ప్రాంగ‌ణాల కోసం ఎదుకుతుండ‌టంతో పాటుగా వినూత్న‌మైన ప్రొడ‌క్ట్ ప్లేస్ మెంట్స్ కోసం చూస్తున్నాయ‌న్నారు. ఈ అవ‌స‌రాల‌న్నీ తీర్చే ఒన్ స్టాప్ కేంద్రంగా ఈ-గ్యాలెరియా నిలువ‌నుంద‌న్నారు. ఈ నూత‌న అవ‌తార్ బ్రాండ్ల మ‌ద్ద‌తు, లాయ‌ల్టీ వినియోగించుకోవ‌డంలో త‌మ‌కు స‌హాయ‌ప‌డ‌టంతో పాటుగా వ్యాపార సంస్థ‌లు, హైద‌రాబాద్ న‌గ‌రం క‌లిసి ఎద‌గ‌డానికి, స్థిర‌మైన ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ను అభివృద్ధి చేయ‌డానికి త‌మ‌కు అవ‌కాశాన్ని అందిస్తుంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement