Saturday, April 20, 2024

హైదరాబాద్‌లో వేగంగా విస్తరణ ప్రణాళికలు చేపట్టిన టెక్‌ఫైండర్‌

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డైరెక్ట్‌ రిక్రూటింగ్‌ పోర్టల్‌ అయిన టెక్‌ఫైండర్‌-ఇండియా అధికారికంగా హైదరాబాద్‌లోకి ప్రవేశించింది. వెస్టిన్‌ హోటల్‌లో మంగ‌ళ‌వారం టెక్‌ఫైండర్‌ బ్రాండ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టెక్‌ఫైండర్‌, సిఇఒ ప్రవీణ్‌ మదిరే మాట్లాడుతూ… బిజినెస్‌ల కోసం సరికొత్త యాడ్‌-ఆన్‌ ఫీచర్‌, ప్రత్యేకమైన రిఫరెన్స్‌ చెక్‌ ఫంక్షనాలిటీ వివరాలను తెలియజేశారు. కొత్త ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు ఉద్యోగులు వారి సూచనలను స్టోర్‌ చేయడానికి బ్లాక్ చెయిన్‌-అధారితమైన కెరీర్‌ రిఫరెన్స్‌ లాకర్‌ సదుపాయం కలదన్నారు. ఈ ఫీచర్‌ భావి యజమానులు వారి పని చరిత్రపై మునుపటి యజమానుల నుండి వచ్చిన సూచనలను తనిఖీ చేసుకోవడానికి వీలు కల్పిస్తుందన్నారు. వినూత్నమైన, అంతరాయం లేని సాంకేతికత అనేది హెచ్‌ఆర్‌ టెక్నాలజీ విభాగంలో ఈ ఫీచర్‌ సరికొత్తదన్నారు. మొదటిది, యజమానులు నమ్మకంగా ఉద్యోగులను ఎంపిక చేసుకోవడానికి, మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఎంతో సహాయపడుతుందన్నారు. మార్కెట్‌లో త‌మకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. టెక్‌ఫైండర్‌ దాని అనుకూలత, వేగం, త‌మ ప్లాట్‌ఫారమ్‌ సౌలభ్యం, అన్ని వ్యాపార అవసరాల కోసం అర్హత కలిగిన, అనుభవజ్ఞులైన ప్రతిభావంతులను కనుగొనడంలో అధిక విజయాల రేట్లతో గుర్తింపును పొందింద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement