Saturday, April 20, 2024

Field analysis : ఉప్పల్​ స్టేడియంలో టీమిండియాదే విక్టరీ.. అనలిస్టులు ఏమంటున్నారంటే!

హైదరాబాద్​ ఉప్పల్​ ఇంటర్నేషనల్​ స్టేడియంలో ఇవ్వాల ఆస్ట్రేలియా, టీమిండియా బిగ్​ ఫైట్​ జరగనుంది. మూడు టీ20ల సిరీస్​లో ఇప్పటికే ఇరు జట్లు చెరో మ్యాచ్​ గెలుచుకున్నాయి. ఇక ఇవ్వాల (ఆదివారం) జరిగే మ్యాచ్​ ఇరు జట్లకు కీలకం కానుంది. ఇంతటి టఫ్​ మ్యాచ్ కోసం క్రికెట్​ లవర్స్​ అంతా టెన్షన్​తో వెయిట్​ చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనుంది.

ఇక.. ఉప్పల్ స్టేడియం గురించి కొన్ని విషయాలు పరిశీలిస్తే ఇంట్రెస్టింగ్​ అంశాలు తెలుస్తున్నాయి. ఈ స్టేడియం నిర్మాణం 2003లో చేపట్టారు. దీని సీటింగ్ కెపాసిటీ 55 వేలుగా ఉంది. 2005లో గ్రౌండ్ నిర్మాణం పూర్తయ్యింది. మొదట్లో స్టేడియానికి విశాఖ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంగా నామకరణం చేశారు. ఆ తర్వాత అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంగా దీనికి పేరు మార్చారు.

ఉప్పల్‌లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ 2005లో జరిగింది. ఆ ఏడాది నవంబర్ 16న భారత్, సౌతాఫ్రికా మధ్య వన్డే మ్యాచ్‌ కు హైదరాబాద్ వేదికైంది. ఈమ్యాచ్‌లో యువరాజ్ సింగ్ 122 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. ఇప్పటివరకు ఇక్కడ రెండు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు జరిగాయి. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ జయభేరీ మోగించింది. మరో మ్యాచ్‌ ఆస్ట్రేలియాతో జరగాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ రద్దు అయ్యింది. కాగా, ఇవ్వాల జరగనున్న మ్యాచ్‌కు సైతం వరుణ గండం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కానీ, వాతావరణం అనుకూలిస్తే ఉప్పల్ స్టేడియంలో భారత్‌కు తిరుగు ఉండదని క్రికెట్ అనలిస్టులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement