Sunday, December 5, 2021

స్పా సెంట‌ర్ల‌పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు

హైదరాబాద్ లో స్పా సెంటర్ల‌పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసారు. న‌గ‌రంలోని బంజారాహిల్స్, పంజాగుట్ట, మహంకాళి, ఖర్కనా, మరెడ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలలో ఉన్న అన్ని స్పా లపై వెస్ట్ జోన్, నార్త్ జోన్, సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి ఈ దాడులు చేసారు.

మ‌సాజ్ సెంటర్ల ముసుగులో నిభందనలకు విరుద్ధంగా పలువురు స్పా నిర్వాహకులు క్రాస్ మసాజ్ కు పాల్పడుతున్నట్లు పోలీసుల‌కు స‌మాచారం అందింది. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వ‌హించి 33 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడులలో పలువురు నిర్వాహకులు, మహిళా ఉద్యోగులు, కస్టమర్లను అదుపులోకి పోలీసులు తీసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News